3కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

3కిలోల గంజాయి స్వాధీనం

Nov 5 2025 8:07 AM | Updated on Nov 5 2025 8:07 AM

3కిలోల గంజాయి స్వాధీనం

3కిలోల గంజాయి స్వాధీనం

ఖమ్మంక్రైం: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయిని ఖమ్మం కొత్త బస్టాండ్‌ సమీపా న మంగళవారం ఎకై ్సజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఎకై ్సజ్‌ స్టేషన్‌–1 అధికారులు తనిఖీచేస్తుండగా ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా పంగం గ్రామానికి చెందిన ఉమాకాంత్‌ నాగులు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయన వద్ద బ్యాగ్‌ల్లో పరిశీలించగా 3.290 కిలోల గంజాయి లభించింది. మల్కాన్‌గిరి నుంచి హైదరా బాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు తేలగా నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.కృష్ణ, ఎస్‌హెచ్‌ఓ రేష్మా సుల్తానా, ఎస్సై కె.సాయిబాబా, సిబ్బంది పాల్గొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఖమ్మంక్రైం: రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి(40) మృతి చెందాడు. పందిళ్లపల్లి – ఖమ్మం రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం ఈ ఘటన చోటు చేసుకోగా మృతుడు ఒడిశా రాష్ట్ర వాసిగా భావిస్తున్నట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణరెడ్డి అన్నారు. ఈమేరకు మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.

మహిళ బ్యాగ్‌ నుంచి రూ.50వేలు చోరీ

వైరా ఆర్టీసీ బస్టాండ్‌లో ఘటన

వైరా: వైరా ఆర్టీసీబస్టాండ్‌లో తరుచూ చోరీలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా మంగళవారం కూడా ఓ మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌ నుంచి నగదు చోరీ చేశారు. తా టిపూడి గ్రామానికి చెందిన జి.నాగలక్ష్మి గ్రామంలో సర్వీస్‌పాయింట్‌ నిర్వహిస్తుంది.తాటిపూడినుంచి ఆటోలో వైరాకు వచ్చిన ఆమె కొణిజర్ల వెళ్లేందుకు బ స్టాండ్‌లో బస్సు ఎక్కింది. ఈ సమయాన గుర్తు తెలి యని వ్యక్తులు ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌ తస్కరించి అందులోని రూ.50వేలు తీసుకుని బ్యాగ్‌ను మరో బస్సులో పడేశారు. ఆ బస్సు కండక్టర్‌ బ్యాగ్‌లో ఫోన్‌నంబర్‌ ఆఽ దారంగా మహిళకు సమాచారంఇవ్వగా,ఆమె రూ. 50 వేలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం

కూసుమంచి: కూసుమంచి మండల కేంద్రంలో మంగళవారం ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లోడుతో కూసుమంచి వైపు ఓ ట్రాక్టర్‌ వస్తుండగా.. వెనక నుండి వచ్చిన మరో ట్రాక్టర్‌ డ్రైవర్‌ అయ్యప్ప ట్రేడర్స్‌ సమీపాన ఓవర్‌టేక్‌ చేసే క్రమాన అదుపు తప్పి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇసుక ట్రాక్టర్‌ ఇంజన్‌ డివైడర్‌పైకి ఎక్కగా ట్రక్కు బోల్తా కొట్టింది. ఆపై ట్రాక్టర్‌ను అదుపు చేసే ప్రయత్నంలో అది వెనక్కి వెళ్తూ దుకాణాల బోర్డులు, టీవీఎస్‌ షోరూం ముందు వాహనాలను ఢీకొట్టింది. అక్కడే మూడు చక్రాల సైకిల్‌పై వెళ్తున్న దివ్యాంగుడు ఫ్రాన్సిస్‌ సైతం ఢీకొట్టడంతో గాలయ్యాయి. ఘటనపై కనకం లింగయ్య ఫిర్యాదుతో ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్‌ బానోత్‌ సుధీర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

రఘునాథపాలెం: మండలంలోని గణేశ్వరం గ్రామానికి చెందిన యాస సత్యనారాయణ(50) అనా రోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఈనెల 2వ తేదీన గడ్డి మందు తాగగా కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈమేరకు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందడంతో ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement