రేపటి నుంచి ‘పది’ మూల్యాంకనం
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగియగా.. ఈ నెల 7వ తేదీ నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాల్యూయేషన్ (మూల్యాంకనం) ప్రక్రియను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో వాల్యూయేషన్ కార్యక్రమం ప్రారంభం కానుండగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటోంది. జిల్లాకు 2,13,000 సమాధాన పత్రాలు వచ్చాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం చేయనుండగా.. డీఈఓ క్యాంపు ఆఫీసర్‌గా ఉంటారు.
రేషన్ దుకాణాల పరిశీలన
రఘునాథపాలెం: మండలంలోని రేషన్ దుకాణాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్ శనివారం పరిశీలించారు. హరియాతండాలో రేషన్ బియ్యం వండించి, రుచి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 1వ తేదీ నుంచి కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్నామని, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీటీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ నరేశ్ పాల్గొన్నారు.


