నేలకొండపల్లి: బైక్ అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రఘునాధపాలెం మండలం ఖానాపురం హవేలీకి చెందిన రామారావు బుధవారం నేలకొండపల్లి మండలంలోని చెన్నారంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి బైక్‌పై బయయలుదేరాడు. నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద బైక్ అదుపు తప్పడంతో ఆయన కింద పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను 108లో ఖమ్మం తరలించారు.
అదుపుతప్పి ఆటోట్రాలీ బోల్తా
కామేపల్లి: పత్తి లోడ్‌తో వెళ్తున్న ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. మండలంలోని ఊట్కూర్ గ్రామానికి చెందిన పత్తి వ్యాపారి గుడిమెట్ల సైదులు బుధవారం పత్తి లోడ్ చేసుకుని ఖమ్మం బయలుదేరాడు. ఈక్రంమలో ముచ్చర్ల క్రాస్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
నేలకొండపల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో కుక్కలు దాడి చేయగా ముగ్గురికి గాయాలయ్యాయి. గువ్వలగూడెంకు చెందిన వృద్ధురాలు నర్సమ్మ, అనంతనగర్‌లో దీక్షిత్, సదాశివాపురానికి చెందిన ప్రియతమ్ బుధవారం గాయపడగా నేలకొండపల్లి ఆస్పత్రిలో చికిత్స చేయించారు.