ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఏవైనా తిరస్కరిస్తే అందుకు కారణాలు వెల్లడించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


