యువత బలోపేతం కావాలి
ఖమ్మం రాపర్తి నగర్: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సోమవారం యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో వివేకానంద చిత్రపటానికి జిల్లా యువజన, క్రీడా శాఖాధికారి టి.సునీల్‌రెడ్డి స్వామి వివేకానంద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుడి స్ఫూర్తితో యువత స్వశక్తిపై ఆధారపడుతూ బలోపేతం కావాలని, తద్వారా మరికొందరికి అండగా నిలవాలని సూచించారు. క్రీడా శిక్షకులు ఎండీ.గౌస్, మేనేజర్ ఉదయ్‌కుమార్, జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు కె.ఉమాశంకర్‌తో పాటు పి.హరిబాబు, షఫీ అహ్మద్, శైలజ, చందన, టి.నాగమణి తదితరులు పాల్గొన్నారు.


