● బైక్ను ఢీకొన్న లారీ
హోసూరు: పాఠశాల నుంచి తండ్రి పిల్లలను ద్విచక్రవాహనంలో ఇంటికి తీసుకెళుతుండగా లారీ ఢీకొని ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. వివరాల మేరకు హోసూరు బొమ్మండపల్లి ప్రాంతానికి చెందిన నిత్యానందన్, బెంగళూరులోని ఐటీ కంపెనీలో ఇంజనీర్. భార్య ప్రియ, కుమార్తెలు తులసి (10), సహన (8)తో హోసూరులో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం నిత్యానందన్ పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్లుతుండగా బెంగళూరు నుంచి తళి వైపు వెళుతున్న లారీ ఢీకొనింది. చిన్నారులు ఇద్దరూ ఘటనా స్థలంలోనే మరణించగా, నిత్యానందన్ తీవ్ర గాయాల పాలయ్యాడు.


