ఆశాల వేతనం రూ.2 వేల పెంపు | - | Sakshi
Sakshi News home page

ఆశాల వేతనం రూ.2 వేల పెంపు

Nov 29 2026 12:58 PM | Updated on Nov 29 2026 12:58 PM

సీఎం డీకే శివకుమార్‌ను కలిసిన ఆశా కార్యకర్తలు

చర్చల తరువాత.. ఊళ్లకు బయల్దేరే పనిలో ఆశాలు

బనశంకరి: వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలనే డిమాండ్‌తో గత 12 రోజులుగా బెంగళూరులోని స్వతంత్ర పార్కులో నిరవధిక ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలతో ప్రభుత్వ చర్చలు ఫలించాయి. శనివారం సీఎం నివాసంలో ఆశాల ప్రతినిధులు డీకేశిని కలిసి చర్చించారు. రూ.2వేలు పెంచుతామని సీఎం డీకే శివకుమార్‌ తెలుపగా ఆశాలు అంగీకరించారు. ఈ మేరకు సీఎం మీడియాకు తెలిపారు. 12 రోజుల పాటు పోరాడి రూ.15 వేలు డిమాండ్‌ చేశారన్నారు. సాధారణంగా ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం నుంచి రూ.2 వేలు, ఆదనంగా రూ.1000 వస్తున్నాయని, పని ఆధారంగా ప్రోత్సాహకం కూడా లభిస్తోందని తెలిపారు. సుదీర్ఘ చర్చల తరువాత ఈ తీర్మానానికి వచ్చామని, ఆశాలు తన మనసు కరిగించారని సీఎం తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి రూ.2 వేల పెంపు వర్తిస్తుందని తెలిపారు. కొందరు గొడవలు చేయడానికి ఆశా కార్యకర్తల తరహాలో దుస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారని, వారిని ఆశా కార్యకర్తలు కనిపెట్టారని అన్నారు. ఎట్టకేలకు ఆశాలకు విజయం దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఆశాల ప్రతినిధులు సీఎంను కలిసి శాలువాతో సన్మానించి ఫోటోలు దిగారు. ఫ్రీడం పార్క్‌ శిబిరం నుంచి వారి ఊళ్లకు బయల్దేరారు.

ఈ జనవరి నుంచి అమల్లోకి

ప్రతినిధులతో సీఎం డీకే చర్చలు

నిరసన విరమణ

చివరి వరకూ పట్టు

శివాజీనగర: సీఎంతో శాంతి చర్చలకు ముందు స్వతంత్ర పార్కులో హైడ్రామా సాగింది. హామీల అమలుకు లిఖితపూర్వక వాగ్దానం కావాలని పట్టుబట్టారు. సీఎం ఆఫీసు నుంచి ఫోన్‌ వస్తేనే కదులుతామని పట్టుబట్టారు. చివరకు సుదీర్ఘ ఆందోళన సుఖాంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement