బనశంకరి: కేపీఎస్‌సీ ఉద్యోగాల కుంభకోణంలో ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్, బ్రోకరు బసవరాజ్ కన్నాళేకు సెప్టెంబరు 10వ తేదీ వరకు సీఐడీ కస్టడీకి బెంగళూరు ఒకటో అదనపు కోర్టు ఆదేశించింది. కేసులో ప్రముఖ వ్యక్తులు, ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై అనుమానాలున్నాయి. కుంభకోణం మూలాన్ని ఛేదించడానికి సీఐడీ సిద్ధమైంది. ఏకంగా 10 రోజుల పాటు ఇద్దరినీ విచారిస్తే లోతైన అంశాలు బయటపడవచ్చని భావిస్తున్నారు.
బసవరాజ్ ఎవరు?
బసవరాజ్ కన్నాళె బీదర్ జిల్లా బాల్కి వాసి కాగా, ఓ జాతీయ పార్టీ జిల్లా నేత అని, తుమకూరు వర్సిటీ పాలకమండలి సభ్యుడని తెలిసింది. అతనికి ట్రావెల్స్‌తో పాటు పలు రకాల వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం.
ఐఏఎస్ జ్ఞానేంద్ర దళారీ బసవరాజ్


