శివమొగ్గ: తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తన తల్లిదండ్రులపై డెత్‌నోటు రాసి ఉరి వేసుకుంది. పిల్లలలో ఇద్దరిని మాత్రమే గుడికి తీసుకెళ్లగా అలిగి ప్రాణాలు తీసుకుంది. వివరాలు.. బాలిక సృష్టి.. 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉండగా, ఆదివారంనాడు సృష్టిని వదిలేసి మిగతా ఇద్దరిని తీసుకుని గుడికి వెళ్లారు. దీంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కొంతసేపటికే బాలిక తల్లిదండ్రులు తనపై ప్రేమ చూపడం లేదని లేఖ రాసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. తుంగానగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.


