బనశంకరి: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా యూత్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో ‘వెటోరమ–బియాండ్ ద ఫ్రేమ్’ పేరుతో ఉద్యాననగరిలో చిత్రకళా పరిషత్‌లో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శన అట్టహాసంగా ముగిసింది. ఆదివారం సెలవు కావడంతో పెద్దసంఖ్య సందర్శకులు, ఛాయాచిత్ర కళా ఔత్సాహికులు తరలివచ్చారు. దేశవిదేశాలకు చెందిన ఉద్ధండ ఛాయాచిత్రగ్రాహకులు తీసిన చిత్రాలను వీక్షించారు. కెమెరా, మొబైల్స్‌తో ఫోటోలు, సెల్పీలు దిగుతూ సందడిచేశారు. ఏడీజీపీ దయానంద్, సీసీబీ డీసీపీ రాజా ఇమామ్‌ఖాసీం తదితరులు కూడా వీక్షించారు. అబ్బురపరిచే ఛాయాచిత్రాలను చూసి ఫోటోగ్రాఫర్ల ప్రతిభను మెచ్చుకున్నారు. విశ్వం, అడవులు, జంతువులు, మానవ జీవితం, నగరాలు వంటి అన్ని అంశాల ఛాయాచిత్రాలు ఇక్కడ పెద్దసంఖ్యలో కొలువుదీరాయి. కెమెరా పనితనం ఉట్టిపడింది. వైపీఎస్ అధ్యక్షుడు వీ.మంజు వికాస్‌శాస్త్రి, కార్యదర్శి ప్రేమకాకడే, సభ్యులు పాల్గొన్నారు.
సందర్శకులకు అబ్బురం


