దళితులకు భూములు పంపిణీ చేయండి | - | Sakshi
Sakshi News home page

దళితులకు భూములు పంపిణీ చేయండి

Jun 30 2026 2:41 AM | Updated on Jun 30 2026 2:41 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరెట్‌ రంగాలకు కేటాయించే భూములను దళితులకు పంపిణీ చేయాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు ఆంజనేయ డిమాండ్‌ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు భూమిని ధారాదత్తం చేయడం మానుకొని భూములు, ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలన్నారు. దళిత వర్గాలకు కేటాయించిన నిధులను ఇతర పథకాలు, అభివృద్ధి పనులకు వినియోగించడం తగదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను దళిత వర్గాలకు రిజర్వేషన్‌ ప్రకారం కేటాయించాలన్నారు. కర్ణాటకలో బౌద్ధ మండలిని ఏర్పాటు చేయాలన్నారు. సంగమేష్‌, జాన్‌ రాజ్‌, గోవిందు, ఆనంద్‌, యేసురాజు, వీరేష్‌, మంజు, అబ్రహం, శివరాజ్‌లున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement