పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు

Jun 30 2026 2:41 AM | Updated on Jun 30 2026 2:41 AM

హొసపేటె: నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీలను సోమవారం రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ నిసార్‌ అహమ్మద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగర జిల్లా పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్‌ కమిషన్‌ చైర్మన్‌ జిల్లా కేంద్రం హొసపేటె నగరంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు, అంజుమన్‌ ఆస్పత్రులను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అదే విధంగా నగరంలోని కూరగాయల మార్కెట్‌ సమీపంలో ఉన్న బాపూజీ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలను, 6వ వార్డు ప్రాంతంలో ఉన్న పాత ప్రభుత్వ బాలికల పీయూసీ కళాశాల ప్రాంగణంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, నగర వక్ఫ్‌ బోర్డు ప్రాంతంలోని అంజుమన్‌ ఆస్పత్రులను తనిఖీ చేశారు. తగిన రికార్డులను నిర్వహించాలని కమిషన్‌ చైర్మన్‌ మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement