కెలమంగలం: పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రావడానికి ఒప్పుకోలేదని ఉన్మాదిగా మారిన భర్త ఆమెను హత్య చేశాడు. తళి వద్ద ఇది జరిగింది. వివరాల మేరకు.. బెంగళూరు సమీపంలోని కనకపుర తాలూకా హుణసనహళ్లికి చెందిన గోవిందప్ప కొడుకు రాజేష్ (27)కు అంచెట్టి తాలూకా మల్లిగేబాయ్‌దొడ్డి గ్రామానికి చెందిన సుస్మిత (26)తో మూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి రెండేళ్ల వయస్సున్న కుమారుడున్నాడు. 3 నెలల క్రితం నుంచి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. సుస్మిత కోపగించుకొని పుట్టింటికెళ్లిపోయింది. ఆదివారం మధ్యాహ్నం రాజేష్ భార్య ఇంటికెళ్లగా గొడవ జరిగింది. దీంతో కత్తితో ఆమె ముఖం, గొంతుపై పొడిచి చంపాడు. అంచెట్టి పోలీసులు చేరుకుని దుండగున్ని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది.


