రాయచూరు రూరల్: ఇటీవల కాలంలో పలు జిల్లాల్లో మతాంతర ప్రేమ గొడవలు లవ్ జిహాద్ పేరిట ప్రచారం పొందాయి. దీనిపై హిందూ సంఘాలు ఆందోళనలు కూడా చేస్తున్నాయి. ఇదే మాదిరిగా బాగల్‌కోటె జిల్లా ఇలకల్‌కు చెందని అక్షత(30) అనే వివాహితని ప్రియుడు నానాసాహెబ్ ప్రేమపేరుతో మభ్యపెట్టి తీసుకెళ్లి హత్య చేయడం లవ్ జిహాదేనని బంధుమిత్రులు ఆరోపించారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మూడేళ్లుగా నరకం చూపి..
అక్షత భర్త, ఇద్దరు పిల్లలను వదిలి నానాసాహెబ్ వెంట బెంగళూరుకు వెళ్లింది. అక్కడ మూడేళ్ల నుంచి నానా విధాలుగా చిత్రహింసలు పెడుతూ మతం మారాలని గొడవలు పడేవాడని తెలిసింది. ఆమె నిరాకరించడంతో వారం రోజుల క్రితం బెంగళూరులోనే అక్షతను హత్య చేయగా, మూడు రోజుల క్రితం విషయం బయట పడింది. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు అధికమయ్యాయని ఇలకల్ చీరల అంబాసిడర్ తృప్తి సాలిమట్‌్ విచారం వ్యక్తం చేశారు.
బంధుమిత్రుల ఆరోపణ


