నగల చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నగల చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

Jun 30 2026 2:41 AM | Updated on Jun 30 2026 2:41 AM

రాయచూరు రూరల్‌ : ఇళ్లలో చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని డీఎస్పీ శాంతవీర వెల్లడించారు. ఆదివారం సాయంత్రం గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైలార నగర్‌ ఆంజనేయ(26), షియాతలాబ్‌ పరశురాం (24)లను అరెస్ట్‌ చేశామన్నారు. 20 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ.3,51,500 ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీఐ నింగప్ప, ఎస్‌ఐ ప్రకాష్‌ డంబళ్‌లున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement