మేలుకోటెలో భక్తకోటి | - | Sakshi
Sakshi News home page

మేలుకోటెలో భక్తకోటి

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

వరుస సెలవులతో భక్తుల రద్దీ

మండ్య: మండ్య జిల్లాలోని మేలుకోటె పుణ్యక్షేత్రంలో వీకెండ్‌ కావడంతో శుక్రవారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు శ్రీ చెలువ నారాయణస్వామి, బెట్టదొడ్డ యోగనరసింహ స్వామివార్ల దర్శనం కోసం భక్తులు వరదలా తరలివచ్చారు. 50 వేల మందికి పైగా భక్తులు స్వామివార్లను దర్శనం చేసుకున్నారు.

పార్కింగ్‌కు అవస్థలు

చెలువ నారాయణ ఆలయం చుట్టూ, రోడ్డుకు ఇరువైపులా వాహనాలను అస్తవ్యస్తంగా నిలపడం వల్ల ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడి భక్తులకు అసౌకర్యం కలిగింది. సెలవు రోజుల్లో మైదానాలలో, కళ్యాణి పరిసరాల్లో భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించాలని ఎమ్మెల్యే దర్శన్‌ పుట్టన్నయ్య సూచించినా పంచాయతీ, పోలీసులు స్పందించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దేవుని దర్శనానికి వస్తే వాహనాలు ఎక్కడ నిలుపుకోవాలో తెలియడం లేదని భక్తులు వాపోయారు. చెలువ నారాయణస్వామి ఆలయ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, కనగోనహళ్లి పరమేశ్వరు గౌడ, ఆలయ ఈఓ శీలా భక్తులకు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement