సర్‌తో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

సర్‌తో ప్రజాస్వామ్యం ఖూనీ

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

మైసూరు: ఓటరు జాబితా నుంచి అర్హులైన వారి పేర్లను తొలగించడం వారి హక్కును లాక్కోవడమే. తీసేసినవారిని తిరిగి చేర్చడం ఎన్నికల సంఘం బాధ్యత అని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఆదివారం మైసూరులోని జె.కె. మైదాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ మైసూరు డివిజనల్‌ స్థాయి ఎస్‌ఐఆర్‌ అవగాహన సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఎన్నిక ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. ఓటు వేయడం వయోజనులందరి హక్కు. దీనిని అరికట్టే హక్కు ఎవరికీ లేదన్నారు. సర్‌ వంటి ప్రక్రియల ద్వారా ఈ దేశం నియంతృత్వంలోకి వెళ్ళిపోతుందని ఆరోపించారు. ’ఓటర్లారా, ప్రజాస్వామ్య మారణహోమం జరుగుతోంది’ అని ఆయన హెచ్చరించారు. జూన్‌ 30 నుంచి జూలై 29 వరకు జరగనున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ప్రతిఒక్కరూ చురుకుగా పాల్గొనాలని తెలిపారు. గతంలో ఏ.ఆర్‌. కృష్ణమూర్తి అనే అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారన్నారు. అందువల్ల, ప్రతి ఓటూ అమూల్యమైనదని తెలిపారు. బీజేపీ సర్‌ ద్వారా బీసీ, మైనారిటీ ఓటర్లను తొలగించబోతోందన్నారు. ఈ సభలో పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ సీఎం సిద్దరామయ్య ధ్వజం

మైసూరులో కాంగ్రెస్‌ సదస్సు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement