మండ్య: అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి 5 ఏళ్ల లోపు బాల బాలికలకు 2 చుక్కల పోలియో మందు పంపిణీ సాగింది. ఆదివారం బెంగళూరుతో సహా అన్ని నగరాల నుంచి పల్లెల దాకా పల్స్ పోలియో అభియాన్ నిర్వహిచారు. ఎమ్మెల్యే రవికుమార్ మండ్య నగరంలోని సదాత్ బరంగాయ్‌లోని ప్రభుత్వ జూనియర్ ఉర్దూ పాఠశాలలో చుక్కల మందు పంపిణీ చేశారు. జూలై 1 వరకు చుక్కల మందు వేస్తారని, తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు ఆరోగ్య కేంద్రాల్లో చుక్కలు వేయించాలని సూచించారు. పిల్లలకు పోలియో సోకకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అధ్యక్షురాలు మీరా శివలింగయ్య, డిహెచ్‌ఓ కె.మోహన్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా పల్స్ పోలియో


