రాయచూరు రూరల్: సమాజంలో అంతరించిపోతున్న స్వరమాల కళలకు జీవం పోయాలని సాయి కిరణ్ కోరారు. శనివారం రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో రంగ కుసుమ సాంస్కృతిక కళా సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక స్వరమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ.. టెలివిజన్, మొబైల్ వాడకం లేని సమయంలో కళలకు ప్రాధాన్యత ఉండేదని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంలో కళలు అంతరించి పోతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, కల్లప్ప, నాగభూషణ్, నీలాంబిక, అరుణ, శంకరప్ప, మురుగేంద్ర, ప్రకాశయ్య, విఠల్, శకుంతల, గోవిందరెడ్డి, సిద్దశ్, ఉత్తర దేవి, హుడేద్, సులోచన తదితరులు పాల్గొన్నారు.


