పోలియో చుక్కలతో చిన్నారులకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

పోలియో చుక్కలతో చిన్నారులకు రక్షణ

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

సాక్షి, బళ్లారి: పోలియో చుక్కలతో చిన్నారులకు రక్షణ లభిస్తుందని మేయర్‌ గాదెప్ప, జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ బసారెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలో జిల్లా ఆస్పత్రిలో పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలియో అనేది చిన్నారులను జీవితాంతం వికలాంగులుగా మార్చే ప్రమాదరకమైన వైరల్‌ వ్యాధి అని తెలిపారు. 0–5 సంవత్సరాల్లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో రహిత సమాజం నిర్మించేందుకు అందరూ సహకరించాలని సూచించారు. రెండు చుక్కలు జీవితాంతం రక్షణ కవచంగా నిలుస్తాయన్నారు.

రాయచూరు రూరల్‌: 0–5 సంవత్సరాల్లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని జిల్లా అధికారి పూవిత సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 132 కేంద్రాలు, 35 ట్రాన్సిట్‌ బూత్‌లలో 9 మొబైల్‌ టీమ్‌లు, 124 మంది సూపర్‌వైజర్లు ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలను పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగస్వాములను చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు సురేంద్ర బాబు, చంద్రశేఖరయ్య, నందిత, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి శరణమ్మ, సరోజ, దండెప్ప బిరదార్‌, లక్ష్మీకాంత రెడ్డి, త్రివిక్రమ జోషి తదితరులు పాల్గొన్నారు.

హొసపేటె: స్థానిక రోటరీ క్లబ్‌ సభాంగణలో 5 సంవత్సరాల్లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు దాదాపీర్‌ మాట్లాడుతూ.. పోలియో రహిత దేశ నిర్మాణంలో సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్‌ సెక్రటరీ కేదారేశ్వర్‌, సభ్యులు అశ్విన్‌ కోతాంబరి, సజ్జన్‌, కిరణ్‌ సోని, మంజునాథ్‌ అంగడి, విజి శ్రీకాంత్‌, డాక్టర్‌.మునివ సుదేవరెడ్డి, డాక్టర్‌.శ్వేతా వస్త్రాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement