ప్రారంభానికి మోక్షమెన్నడో? | - | Sakshi
Sakshi News home page

ప్రారంభానికి మోక్షమెన్నడో?

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా బీసిగిపెరి గ్రామం సమీపంలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రారంభానికి నోచుకోవడం లేదు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో నిర్మించిన భవనం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రారంభం కాకపోవడంతో ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంటోంది. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యా పథకం గ్రాంట్‌ కింద రూ.1.5 కోట్ల వ్యయంతో కస్తూర్బా రెసిడెన్షియల్‌ పాఠశాలను నిర్మించారు. కొత్త భవన నిర్మాణం పూర్తయి సంవత్సరం గడిచినా.. ప్రారంభోత్సవ తేదీని తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ పాఠశాలను వీలైనంత త్వరగా విద్యావంతులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది పిల్లల విద్యకు, వసతికి అనువుగా ఉంటుందని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు.

నిరపయోగంగా ఉన్న

కస్తూర్బా రెసిడెన్షియల్‌ పాఠశాల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement