మహిళలు నాయకులుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు నాయకులుగా ఎదగాలి

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

బొమ్మనహళ్లి: ప్రపంచ జనాభాలో సగం మంది ఉన్న మహిళలను చరిత్ర పొడవునా రెండవ తరగతి పౌరులుగా చూశారని.. వారికి సాధికారత కల్పించడానికి రాజకీయ, ఆర్థిక శక్తి అవసరమని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగమోహన్‌ దాస్‌ అన్నారు. రామనగర నగర శివార్లలోని జానపద లోక్‌లో కర్ణాటక రాష్ట్ర శాసీ్త్రయ పరిశోధన మండలి నిర్వహించిన మూడు రోజుల ’నానె నాయకి–2026’ మహిళా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాల వల్ల మహిళలు వెనుకబడి ఉన్నారన్నారు. నేటికీ, మహిళల సంఖ్య శాసన సభలలో తగిన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ఇటీవల మహిళా రిజర్వేషన్‌ అంశం తెరపైకి వచ్చినప్పటికీ, డీలిమిటేషన్‌ పేరుతో దానిని వెనక్కి నెట్టేశారన్నారు. రాజకీయ మహిళా నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చి, మహిళా రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు మహిళలే నాయకులుగా ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘బుద్ధుడు, బసవ, పెరియార్‌, గాంధీ, నారాయణ గురు, ఫూలే దంపతులు, అంబేడ్కర్‌ తదితర మహనీయులు మహిళల హక్కులకు అనుకూలంగా గళం విప్పారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement