కోలారు: కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేజీఎప్ పారాండహళ్లిలో నివాసం ఉంటున్న అన్నా చెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. కేజీఎఫ్ పారాండహళ్లికి చెందిన బాలాజీ (22), అతడి చెల్లెలు మహశ్రీ (16) మృతులు. వీరు తమిళునాడు నుంచి కేజీఎఫ్‌కు బైక్‌లో బయలుదేరారు. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన లారీ.. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలాజీ, మహశ్రీ తీవ్రంగా గాయపడటంతో మృతి చెందారు. తమిళనాడు పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇద్దరు కేజీఎఫ్ వాసులు మృతి


