ఆదర్శ పాలకుడు కెంపేగౌడ | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ పాలకుడు కెంపేగౌడ

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

మైసూరు: నాడ ప్రభు కెంపేగౌడ జయంతి ఉత్సవాలు బెంగళూరు, మైసూరుతో సహా పలు ప్రాంతాలలో వైభవంగా జరిగాయి. బెంగళూరు నగరానికి పునాది వేయడంతో పాటు ఆయన పాలనను సీఎం డీకే శివకుమార్‌ సహా నేతలు కొనియాడారు. ర్యాలీలు, సంబరాలతో కోలాహలం నెలకొంది. శనివారం మైసూరులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కోటే ఆంజనేయస్వామి ఆలయం నుంచి కళామందిరం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. వెండి రథంపై పూలతో అలంకరించిన కెంపేగౌడ విగ్రహానికి ఎమ్మెల్యేలు టీఎస్‌ శ్రీవత్స, హరీష్‌గౌడ, సోమేశ్వరనాథ స్వామి తదితరులు పూలమాలలు వేయగా ఊరేగింపు ప్రారంభమైంది. జానపద బృందాల ప్రదర్శనలు, మహిళలు, యువత నృత్యాలు ఆకట్టుకున్నాయి. అలంకరించిన ఎద్దులు, పులివేషధారుల సందడి అలరించింది. సినీనటుడు ఎస్‌. జయప్రకాష్‌ (జెపి) సహా వేలాది ఊరేగింపులో పాల్గొన్నారు. తరువాత, కళామందిరంలో జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ ఆనాడు బెంగళూరు నగర భవిష్యత్‌ అభివృద్ధిని ముందే ఊహించిన కెంపేగౌడ, నగరం నాలుగు దిక్కులలో నాలుగు గోపురాలను నిర్మించారని, ఆయన స్వప్నం ప్రకారం బెంగళూరు ప్రవర్ధమానమైందని అన్నారు. దేశం ఇప్పటివరకు చూసిన అరుదైన వ్యక్తి అన్నారు.

బెంగళూరు, మైసూరులో

ఘనంగా జయంతి ఉత్సవాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement