రాయచూరు రూరల్: నీట్ పరీక్ష పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం మంచిది కాదన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు. సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, దరూర్ బసవరాజ్, రజాక్ ఉస్తాద్, అబ్దుల్ కరీం, మారెప్ప, అస్లాంపాషా, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.


