బైక్‌–కేఎస్‌ఆర్‌టీ బస్సు ఢీ | - | Sakshi
Sakshi News home page

బైక్‌–కేఎస్‌ఆర్‌టీ బస్సు ఢీ

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

ఒకరు మృతి

సాక్షి, బళ్లారి: కేఎస్‌ఆర్‌టీసీ బస్సు–ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో సిరుగుప్ప తాలూకా సిరిగేరి గ్రామానికి చెందిన అయ్యప్ప (34) మృతి చెందాడు. శనివారం సాయంత్రం అయ్యప్ప వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. మదిరి క్రాస్‌ వద్ద కేఎస్‌ ఆర్‌టీసీ బస్సు (కేఏ32–ఎఫ్‌ 2022) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయ్యప్ప తీవ్రంగా గాయపడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అతివేగంగా బస్సు నడపడం వల్ల వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్‌ను కురుగోడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement