పీర్ల ఊరేగింపులో విషాదం | - | Sakshi
Sakshi News home page

పీర్ల ఊరేగింపులో విషాదం

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

రాయచూరు రూరల్‌: మొహర్రం పండుగ సందర్భంగా పీర్లను మోస్తూ ఊరేగింపులో పాల్గొన్న వృద్ధుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందిన ఘటన కోప్పళ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొప్పళ జిల్లా అళవండి తాలూకా కవళూరు గ్రామానికి చెందిన చాందు సాబ్‌ (88) మొహరం వేడుకల్లో పీర్లను మోస్తూ అగ్నిగుండంలో దిగి ఊరేగింపులో పాల్గొంటున్నారు. ఈ సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గీతాంజలి సింద్యా వెల్లడించారు.

అగ్నిగుండంలో పడి యువకుడు..

బళ్లారి అర్బన్‌: మొహర్రం వేడుకల్లో ప్రమాదవశాత్తూ అగ్నిగుండంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన బళ్లారి జిల్లా కురుగోడు తాలూకా క్యాదిగెహాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు దేవరాజ్‌ (28)గా గుర్తించారు. దేవరాజ్‌ కిరోసిన్‌ పట్టుకుని అగ్నిగుండాన్ని దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి అగ్నిగుండంలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై కురుగోడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

దేవరాజ్‌ (ఫైల్‌)

చాందు సాబ్‌ (ఫైల్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement