ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలి

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

బళ్లారి టౌన్‌: ఓటు హక్కు రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక గ్రామసభ, వార్డు సభలను నిర్వహించాలి. అర్హుల ఓటర్ల పట్టికను ప్రదర్శించాలని ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక జాతీయ పార్టీల జనపర సంఘాల సమైక్య నేత సిద్దన్న తెలిపారు. శనివారం ఆయన పత్రికా భవనంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల కోసం హెల్ప్‌ డెస్క్‌లు, దాఖలు లేని వారి వాస్తు స్థల ధ్రువీకరణ పత్రాలు, అర్హత గల వారికి మాస్‌కార్డులు అందజేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. అర్హత గల ఓటర్లను గుర్తించి జాబితాలను తయారు చేయాలని సూచించారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రామ వార్డు సభలను నిర్వహించాలని కోరారు. సర్‌ పక్రియ జూన్‌ 30న ప్రారంభం కానుందన ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నేతలు కరూరు మాధవ రెడ్డి, జేఎస్‌.సత్తిబాబు, ఉమాయిన్‌ ఖాన్‌, సంగనకల్లు కృష్ణప్ప, ఫర్వీన్‌ బాను, కణేకల్లు మాబు సాబ్‌, యరకుల స్వామి, వీరేంద్ర కుమార్‌, గంగాధర్‌, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement