మృత్యుశకటమైన ట్యాంకర్
మైసూరు : బైక్‌ను ట్యాంకర్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హున్సూరులోని అరసు కల్లహళ్లి గ్రామ ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగింది. ట్యాంకర్ అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న సురేష్ (63), మాదేవ (52) అనే వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో బైక్ మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. హుణసూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ డిప్యూటీ ఎస్పీ రవి, ఎస్‌ఐ రాధ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
మృత్యుశకటమైన ట్యాంకర్


