నిబంధనలు అతిక్రమిస్తే డీఎల్ రద్దుకు సిఫార్సు
సుప్రీంకోర్టు రోడ్డు సురక్షతా సమితి ఆదేశాల ప్రకారం ఐఎంవీ యాక్ట్ కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడేవారి డీఎల్ సస్పెండ్ చేసి రవాణా శాఖకు సిఫార్సు చేస్తారు. అతివేగంగా వాహనాల డ్రైవింగ్, వాహనాల డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడటం, డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర ట్రాఫిక్ విభాగ జాయింట్ పోలీస్ కమిషనర్ కార్తీక్ రెడ్డి తెలిపారు.
నిబంధనలు ఇవే..
● పరిమిత వేగం కంటే అధిక వేగంతో వెళ్లడం
● రెడ్‌లైట్ పడిన అనంతరం సిగ్నల్ జంప్ చేయడం
● గూడ్స్‌వాహనాల్లో ఓవర్‌లోడ్‌తో తరలింపు
● గూడ్స్‌వాహనాల్లో ప్రయాణికులను తరలించడం
● మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయడం
● వాహనాల డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడటం


