క్రీడాభివృద్ధికి రూ.6 కోట్ల గ్రాంట్
తుమకూరు: అంతర్జాతీయ స్థాయి హాకీ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణంతో సహా జిల్లాలో క్రీడాభివృద్ధికి రూ.6 కోట్ల గ్రాంట్ అందిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. శుక్రవారం నగరంలోని మహాత్మా గాంధీ స్టేడియంలో యువజన సాధికారత, క్రీడా శాఖ, కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా యంత్రాంగం సహకారంతో జరిగిన కర్ణాటక స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. తుమకూరులో వివిధ స్టేడియంలు ఉన్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పూల్స్, హాకీ స్టేడియంలు అవసరమని ముఖ్యమంత్రిని రూ.25 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని కోరగా ముఖ్యమంత్రి ఆ గ్రాంట్ ప్రకటించారని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర అన్నారు. విద్యార్థి జీవితంలో చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కే.గోవిందరాజు, న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, శిరా ఎమ్మెల్యే టి.బి.జయచంద్ర, డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.ఎన్.రాజన్న, కెఎస్‌ఆర్టీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్, ఎమ్మెల్యే జి.బి. జ్యోతి గణేష్, బి.సురేష్ గౌడ, కలెక్టర్ శుభ కళ్యాణ్, ఎస్పీ కె.వి.అశోక్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య


