కొత్త ఏడాది ఎన్నికల రణరంగంతో కోలాహలం కాబోతోంది. ఇప్పటివ
బెంగళూరుకు పాలికె ఎన్నికల జోష్
శివాజీనగర: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్ధారించిన తేదీలోగా గ్రేటర్ బెంగళూరు ప్రాధికారలోని పాలికెలకు ఎన్నికలు జరుపుతాం, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇస్తామని డిప్యూటీ సీఎం, బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి డీ.కే.శివకుమార్ తెలిపారు. జూన్ 30 లోగా బెంగళూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరపాలని, మరీ మరీ గడువు కోరవద్దని సోమవారం సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడం తెలిసిందే. ఈ అంశంపై బెంగళూరు ప్యాలెస్ మైదానంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం ఎన్నికల కోసం ఆదేశాలిస్తుందని తెలిపారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలు కూడా జరపాలి, రాజ్యాంగ నిబంధనల ప్రకారం అన్నీ జరిగిపోవాలని అన్నారు. సాంకేతిక అంశాలపై కొందరు అభ్యంతరాలు సమర్పిస్తున్నారు, వాటి పరిశీలనకు ఓ కమిటీ నియమించామన్నారు. ఎన్నికలు జరిపే బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌దని చెప్పారు. పాలికె వార్డుల రిజర్వేషన్లలో మహిళలకు తక్కువ కేటాయించారనే మాటలువచ్చాయి, తప్పు జరిగిఉంటే సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు మరింత సమయం కావాలని కోర్టును కోరుతారా అని అడిగిన ప్రశ్నకు, లేదు, ఎలాంటి గడువు కోరమని తెలిపారు. తాము చేస్తున్న పనికి ప్రజలు మద్దతు ఇస్తారనే విశ్వాసముంది, సిటీలో ఐదు పాలికెల్లోను గెలుపొందుతామన్నారు. బీజేపీ, జేడీఎస్ పొత్తు గురించి ప్రస్తావించగా, వారు ఏమైనా చేసుకోనీ, కలిసి పోటీ చేసినా, ఫ్రెండ్లీ ఫైట్ చేసినా సరే అని అన్నారు.
మేము రెడీ: సీఎం
గ్రేటర్ బెంగళూరు అథారిటీ(జీబీఏ)తో పాటు జెడ్పీ, టీపీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం సిద్దరామయ్య మైసూరులో చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌లు పొత్తుతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
గాంధీ అంటే బీజేపీకి అలర్జీ: సీఎం
మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, జీ రామ్ జీ చట్టం రద్దు అయ్యేవరకు తమ పోరాటాన్ని కొనసాగించాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేగా బచావ్ సంగ్రామం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఇది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఆందోళన. ఉత్తర భారతంలో రైతులు పోరాడినట్లుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ పేరు అంటేనే బీజేపీ నాయకులకు అలర్జీ అని విమర్శించారు.
నోట్లపై చిత్రాన్నీ తీసేస్తారు: డీసీఎం
బీజేపీవారు గతంలో గాంధీజీని హత్యచేశారు. నేడు ఆయన పేరును అంతం చేశారు, మునుముందు నోట్లపై ఉన్న గాంధీ చిత్రాన్ని తొలగిస్తారు అని డీసీఎం ఆరోపించారు. గాంధీ పేరెత్తే అర్హతను బీజేపీ కోల్పోయిందన్నారు. దీనిపై అన్ని తాలూకాల్లో పార్టీచే ధర్నాలు, పాదయాత్రల పోరాటం జరగాలని సూచించారు. శికారిపురలో తానే ఐదారు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన పనిని చేయాలి, ఇందులో ఎలాంటి దయా దాక్షిణ్యం లేదు. ఎవరు పనిచేయరో వారిని తొలగిస్తామన్నారు. త్వరలో జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
కన్నడనాట.. సర్!
దేశవ్యాప్తంగా భారీ వివాదం సృష్టించిన ఓటర్ల జాబితా ప్రత్యేక పరిష్కారం (ఎస్‌ఐఆర్) రాష్ట్రంలో గ్రేటర్ బెంగళూరు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే జరగనుంది. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితాలోనూ సవరణలు జరగవచ్చు. కేంద్ర ఈసీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఈసీ అధికారులు ఏర్పాట్లు ఆరంభించారు. రాష్ట్రంలో ఓటు చోరీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కాబట్టి త్వరలోనే సర్‌ను చేపట్టవచ్చని భావిస్తున్నారు.
గ్రేటర్ బెంగళూరు సహా జడ్పీలు, టీపీలకు ఎలక్షన్స్
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడి
కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని సూచన
నాలుగైదు నెలల్లో అన్ని స్థానిక ఎన్నికలు
రాబోయే నాలుగైదు నెలల్లో రాష్ట్రంలో అన్ని నగర, గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి, అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. మంగళవారం ప్యాలెస్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. నరేగా బచావ్ సంగ్రామ్, ఓటర్ల జాబితాల బీఎల్‌ఏలకు జాగృతి, స్థానిక సమరానికి సన్నద్ధతపై చర్చించారు. సుప్రీం ఆదేశాల ప్రకారం జూన్‌లో గ్రేటర్ బెంగళూరులోని 5 పాలికెలకు ఎన్నికలు జరుగుతాయని డీసీఎం ప్రకటించారు. జెడ్పీ, తాలూకా పంచాయతీ, గ్రామ పంచాయతీలకు కూడా త్వరలోనే ఎన్నికలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 186 కాంగ్రెస్ కార్యాలయాలు నిర్మించాల్సి ఉందన్నారు. 22 మందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు తమ సొంత సొమ్ముతో కార్యాలయాలను నిర్మించి ఇచ్చారని చెప్పారు. 122 భవనాల నిర్మాణం సాగుతోంది, అన్ని జిల్లా, తాలూకాల్లో పార్టీకి సొంత కార్యాలయ భవనాలను నిర్మించడమే ఆశయమని చెప్పారు.
కొత్త ఏడాది ఎన్నికల రణరంగంతో కోలాహలం కాబోతోంది. ఇప్పటివ
కొత్త ఏడాది ఎన్నికల రణరంగంతో కోలాహలం కాబోతోంది. ఇప్పటివ
కొత్త ఏడాది ఎన్నికల రణరంగంతో కోలాహలం కాబోతోంది. ఇప్పటివ


