కాఫీ పంటకు నష్టం
బనశంకరి: చిక్కమగళూరు జిల్లాలో మంగళవారం రెండుగంటల పాటు భారీ వర్షం కురిసింది. జిల్లాలో కాఫీ తోటల్లో రైతులు కోతలు చేపడుతున్నారు. కొన్నిప్రాంతాల్లో కాఫీ గింజలను ఎండబెడుతున్నారు. ఆకస్మిక వర్షంతో ఈ పనులకు ఆటంకం ఏర్పడింది. నాలుగైదురోజులుగా మలెనాడు ప్రాంతంలో మేఘావృతం కావడంతో కాఫీ గింజలను ఎండబెట్టడం సవాల్‌గా మారింది. ఆరుబయట ఎండబెట్టిన గింజలు వాననీటిలో తేలియాడుతూ కొట్టుకుపోవడంతో రైతులు కంగారుపడ్డారు. కళస, కుదురెముఖ, మూడిగెరె, హొరనాడు, శృంగేరి, చిక్కమగళూరులో రాత్రి వరకూ వాన కురిసింది. వరి పంటకు ప్రమాదం నెలకొంది.


