ఉగాండా డ్రగ్స్ వ్యాపారి అరెస్టు
బనశంకరి: మంగళూరు పోలీసులు సోమవారం ఉగాండాకు చెందిన మహిళా డ్రగ్స్‌పెడ్లర్ జలియా రుల్వాంగోను అరెస్ట్ చేశారు. రూ.4 కోట్ల విలువచేసే 4 కిలోల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆమె బెంగళూరు జిగణి నుంచి మంగళూరులో వివిధ ప్రాంతాలకు డ్రగ్స్‌ను సరఫరా చేసేది. ఇది తెలిసి బెంగళూరుకు వెళ్లి అరెస్ట్ చేశారు. మంగళూరులో 6 మంది ఎండీఎంఏ డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేసి విచారించినప్పుడు జలియా గురించి చెప్పారు. దీంతో జలియా అరెస్టు సాధ్యమైందని తెలిపారు.


