మనోవాంఛల్ని తీర్చే హెబ్బెట్ట బసప్ప
● స్వామివారికి సంక్రాంతి పూజలు
మండ్య: ప్రకృతి సౌందర్యం మధ్య మండ్య జిల్లాలోని హలగూరు సమీపంలోని బసవనహళ్లి గ్రామంలోని కొండపై ఉన్న హెబ్బెట్ట బసవేశ్వరునికి వ్రతం చేస్తే భక్తులకు కోరిన కోర్కెలు నెరవేరుతాయి. సంతానం, వివాహం,కోర్టు కేసులు వంటి సమస్యలు తొలగిపోతాయని పూజారి బసప్ప అన్నారు. సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ధనుర్మాసం మొదటి రోజు నుంచి ప్రతిరోజు ప్రత్యేక అర్చనలు చేపట్టినట్లు తెలిపారు. సంక్రాంతి పర్వదినాలు రావడంతో పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించి, పూజలు జరిపారు. సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన హెబ్బెట్టలోని బసవేశ్వర స్వామి ఆలయం చోళుల కాలం నాటిది, చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఇలవేల్పు అని తెలిపారు. సంతానం లేనివారు, పెళ్లి కానివారు, ఇతరత్రా కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఇక్కడ స్వామివారికి జంతు బలి ఇచ్చి పూజలు చేస్తే ఇట్టే పరిష్కారం అవుతాయని అర్చకుడు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏదైనా వేడుకలు లేదా జాతరలు చేయదలిస్తే మొదట హెబ్బెట్ట బసప్పను పూజించి ముందుకు సాగడం అనాది కాలం నుంచి వస్తున్న ఆచారమని చెప్పారు.
సైబర్ వలలో పడకండి
మైసూరు: ప్రజల భద్రత కోసం నగరంలోని వివిధ ప్రాంతాలలో చాముండి మహిళా సురక్ష పడే ద్వారా నేరాల నివారణపై జాగృతి నిర్వహించారు. పలు కూడళ్లలో మహిళా పోలీసులు మహిళలను కలిసి సైబర్ నేరాలను ఎలా నిరోధించాలో, ఆ నేరాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. చైన్ స్నాచింగ్‌లు జరగకుండా జాగృతి కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియమాలను పాటించడం గురించి వివరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే హెల్ప్‌లైన్ 1930 కు, ఇతర నేరాలు జరిగితే 112 నంబరుకు కాల్‌చేసి సహాయం పొందాలని తెలిపారు.
మహిళలకు భద్రత కరువు
మైసూరు: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తూ బిజెపి మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు సోమవారం రామస్వామి సర్కిల్‌లో ధర్నా చేశారు. ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హుబ్లీలో పోలీసులు ఓ మహిళను వివస్త్రగా ఠాణాకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యే టి.ఎస్. శ్రీవత్స మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మహిళల హత్యలు, అత్యాచారాలు ఎక్కువైనట్లు ధ్వజమెత్తారు. హుబ్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు పట్టపగలు ఒక మహిళపై అత్యాచారం చేశారన్నారు.
ఉత్సాహంగా సిరిధాన్య నడక
బొమ్మనహళ్లి: బెంగళూరు బీటీఎం లేఔట్‌లోని కోరమంగళలో సంక్రాంతి వేడుకలను సోమవారం రవాణా మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించారు. చెరకు గడలతో పాటు, నువ్వులు, బెల్లం – ఆనప మేళా ప్రారంభించారు. ఉదయమే సిరిధాన్యాల నడకలో వేలాదిమంది పాల్గొన్నారు. రామలింగా రెడ్డి మాట్లాడుతూ మన ఆరోగ్యానికి చిరు ధాన్యాల ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో స్టాళ్లు ఏర్పాటయ్యాయి. రైతులు నేరుగా తీసుకొని వచ్చి చెరకు, నువ్వులు, బెల్లంతో పాటు వివిధ వంటకాలను మహిళలు విక్రయించారు.
మనోవాంఛల్ని తీర్చే హెబ్బెట్ట బసప్ప
మనోవాంఛల్ని తీర్చే హెబ్బెట్ట బసప్ప
మనోవాంఛల్ని తీర్చే హెబ్బెట్ట బసప్ప


