పక్కింటి కుర్రవాడే ప్రాణం తీశాడు
బనశంకరి/ కృష్ణరాజపురం: బెంగళూరులో ఈ నెల 3వ తేదీన అద్దె ఇంట్లో అగ్ని ప్రమాదంలో చనిపోయిన మహిళా టెక్కీది సాధారణ మరణం కాదు, హత్య అని తేలింది. ఆమె పక్కింటిలో ఉండే యువకుడే హంతకుడని నిర్ధారించారు. రామమూర్తినగరలో సుబ్రమణ్య లేఔట్‌లో మహిళా టెక్కీ షర్మిలా కేసు మలుపు తిరిగింది. వివరాలు.. మంగళూరుకు చెందిన షర్మిలా (34) ఏడాది క్రితం బెంగళూరుకు చేరుకుని యాక్సెంచర్ ఐటీ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. ఆమె గదిలో ఈ నెల 3వ తేదీ రాత్రి మంటలు లేచాయి, తెల్లవారుజామున ఇంటి యజమాని రామమూర్తినగర పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా వారు వచ్చి మంటలను ఆర్పివేసి నిర్జీవంగా ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఫోన్ స్విచాన్ కావడంతో..
పోలీసులు ఇది అగ్నిప్రమాదమా, లేక అనుమానాస్పద ఘటన అని విచారణ చేపట్టారు. షర్మిల మొబైల్‌ఫోన్ కనిపించలేదు. ఆమె స్నేహితురాలు కూడా అనుమానాస్పదమంటూ ఫిర్యాదు చేసింది. షార్ట్ సర్క్యూట్ ఏదీ జరగలేదని, శరీరంపై రక్త గాయాలున్నాయని గుర్తించారు. మరోవైపు 3 రోజులు తరువాత ఆమె మొబైల్ ఆన్ అయింది. పోలీసులు మొబైల్ టవర్ లొకేషన్‌ను పరిశీలిస్తే షర్మిల ఇంటి పక్కన ఉండే ఇంటిని చూపించింది. దీంతో ఆ ఇంటిలో నివసించే కర్నాల్ కురయ్ (20) అనే యువకున్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిప్పు పెట్టడంతో కాలిపోయిన గది షర్మిల (ఫైల్)
బెంగళూరులో మహిళా టెక్కీ
అనుమానాస్పద మృతి కేసు..
ప్రమాదం కాదని నిర్ధారణ
కోరిక తీర్చాలని దాడి చేసి, హత్య
పక్కింటి కుర్రవాడే ప్రాణం తీశాడు


