కురయ్‌లో క్రూరుడు..
కురయ్ పీయూసీ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. మొబైల్‌లో పోర్న్ వీడియోలకు బానిస అయ్యాడు. అతడు షర్మిల మీద కన్నేశాడు. ఇంటి పక్కనే ఉండడంతో అతడు ఆమెను పలకరించేవాడు, చిన్న పిల్లాడు అనే భావనతో ఆమె నవ్వుతూ మాట్లాడేది. ఆమె మీద మనసు పారేసుకున్న నిందితుడు.. ఆ రోజు రాత్రి 19:30 సమయంలో ఇంటిలోకి చొరబడ్డాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించసాగాడు. కంగారుపడిన ఆమె అతడిని పక్కను తోసి కేకలు వేయసాగింది. కోపోద్రిక్తుడైన కురయ్ ఆమె మీద దాడిచేసి గొంతు పిసికి హత్య చేశాడు. సైన్స్ విద్యార్థి అయిన నిందితుడు.. మంటల్లో కాలిపోతే సాక్ష్యాలు ఉండవని
భావించి తలదిండు, రగ్గులు, ఇతర వస్తువులను రూమ్‌లో వేసి నిప్పుపెట్టాడు. ఆమె మొబైల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు ఆమె ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు, ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించగా ఎక్కడా క్లూ లభించలేదు. కానీ ఆమె ఫోన్‌లోని సిమ్‌ను తీసేసి కురయ్ తన సిమ్‌ను వేసుకుని ఆన్ చేసుకున్నాడు. తద్వారా జాడ లభించింది. 3 రోజుల పాటు విచారణ జరిపి ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


