ప్రైవేటు స్కూలు బస్సు పల్టీ
మాలూరు: డ్రైవర్ నియంత్రణ తప్పి పాఠశాల బస్సు రోడ్డు పక్కకు బోల్తాపడిన ఘటన మంగళవారం ఉదయం తాలూకాలోని అరుణఘట్ట గేట్ వద్ద జరిగింది. వివరాలు.. తాలూకాలోని కుడియనూరు గ్రామ సమీపంలో ఉన్న బోస్ ప్రైవేటు పాఠశాల బస్సు పల్లెల నుంచి విద్యార్థులతో వస్తోంది. ఘటనాస్థలిలో డ్రైవరు అలసత్వం వల్ల బోల్తా పడింది. 17 మందికి పైగా 4, 5 తరగతుల విద్యార్థులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కోలారు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బస్సు వెనుకే కారులో వస్తున్న సురేంద్రరెడ్డి అనే వ్యక్తి పిల్లలను బస్సులో నుంచి బయటకు తీసుకొని కారులో మాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శ్రీనివాస్, మంజునాథ్, సంగీత చికిత్స చేశారు. విషయం తెలిసి తల్లిదండ్రులు పరుగు పరుగున వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
17 మంది బాలలకు గాయాలు
మాలూరు వద్ద ప్రమాదం


