ఆరోగ్య సంరక్షణ అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సంరక్షణ అవసరం

Nov 5 2025 7:51 AM | Updated on Nov 5 2025 7:51 AM

ఆరోగ్

ఆరోగ్య సంరక్షణ అవసరం

హొసపేటె: అన్ని సంపదల కంటే ఆరోగ్య సంపద గొప్పది, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని హెడ్‌ కానిస్టేబుల్‌ స్వరూపానంద ఎం. కొట్టూరు తెలిపారు. మంగళవారం తాలూకాలోని గుడేకోటెలో నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒత్తిడితో కూడిన జీవితం, డబ్బు సంపాదించాలనే వ్యామోహం కారణంగా ఆరోగ్య సంరక్షణ తగ్గుతోంది. ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందని ఎవరూ మరిచిపోకూడదని ఆయన అన్నారు. ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించాలన్నారు. ధర్మస్థల గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు వ్యవసాయ పర్యవేక్షకుడు మహాలింగ, గుడేకోటె జోన్‌ పర్యవేక్షకుడు కరియప్ప, నాలెడ్జ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ యూనియన్‌ కో–ఆర్డినేటర్‌ సరస్వతి యూనియన్‌ అధ్యక్షురాలు మీనాక్షి, కోశాధికారి కరి నూర్జహాన్‌, సేనా ప్రతినిధులు కవిత, నేత్రావతి, నవీన తాజ్‌, లక్ష్మి, సునీత, హేమావతి పాల్గొన్నారు.

పత్తి కొనుగోలు

కేంద్రం ప్రారంభం

రాయచూరు రూరల్‌ : అతివృష్టి, అనావృష్టితో తల్లడిల్లిన జిల్లాలో రైతులను అరకొరగా మిగిలిన పత్తినైనా అమ్ముకుందామంటే నానా బాధలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. సోమవారం నగరంలోని ఆర్‌ఏపీఎంసీలో భారతీయ పత్తి మండలి (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో నలిగి పోతున్నారు. దళారులు చేతిలో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం కొత్త నియమాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కంపాస్‌ కిషన్‌ యాప్‌లో ఒక రోజు 100 స్లాట్‌ బుక్కింగ్‌లు మాత్రమే అవుతున్నాయి. నగరంలోని ఆర్‌ఏపీఎంసీలో మాత్రమే అమ్ముకోడానికి అవకాశం కల్పించారు. అధికారులు తెచ్చిన నూతన ఆదేశాలతో ఎల్‌–1, ఎల్‌–2, ఎల్‌–3లను పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రైతు రామలింగ వెల్లడించారు. మొదటి రకం పత్తికి క్వింటాళకి రూ.8110, రెండవ రకం పత్తికి రూ.7710 ధర నిర్ణయించారు. ఏపీఎంసీలో క్వింటాల్‌కు రూ.6500 నుంచి రూ.7300 వరకు ధర పలుకుతుంది.

కుష్టు వ్యాధిపై జాగృతి జాతా

రాయచూరు రూరల్‌ : సమాజంలో క్షయ వ్యాధిని ప్రజలకు దూరంగా ఉంచాలని, దాని నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ సురేంద్రబాబు పిలుపు ఇచ్చారు. నగరంలోని జహీరాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. 2035 నాటికి దేశంలో వ్యాధిని పూర్తి నియంత్రణకు తేవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పాటించాలన్నారు. ప్రపంచంలో వ్యాధి సోకిన మరుక్షణమే ఆరు నెలల పాటు చికిత్స పొందాలన్నారు. జాతాలో నగరసభ సభ్యురాలు ఉమా, వైద్యాధికారులు గణేష్‌, షాకీర్‌, నందిత, సరోజ, రవీంద్ర జాలదార్‌, అనితలున్నారు.

కడ్లె గౌరమ్మ వైభవం

చూసొద్దాం.. రండి

నేటి నుంచి ఉత్సవాలకు శ్రీకారం

వేలాదిగా తరలి రానున్న భక్తులు

హుబ్లీ: కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వారధిగా అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా విడపనకల్లులో వెలసిన కడ్లె గౌరమ్మ ఉత్సవాలకు బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నో రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ముంబై తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు మొదలు బళ్లారి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కార్తీక పౌర్ణమి ప్రతి ఏటా ఎప్పుడు వస్తుందా? అని వేచి చూస్తారు. కాగా ఈ వేడుకలు బుధవారం సాయంత్రం కడ్లే గౌరమ్మ యువక సంఘం, భజన మండలి సహకారంతో మంగళ వాయిద్యాలతో వెండి బసవేశ్వర ఉత్సవంతో గంగా సమేతంగా గౌరి దేవిని బసవేశ్వర దేవస్థానానికి ఆహ్వానిస్తారు. 6న గురువారం ఉదయం 8 గంటల నుంచి ధ్వజారోహణం 9.30 నిమిషాలకు, గౌరి దేవి ప్రతిష్ట ఆ తర్వాత సనాతన సంప్రదాయ ప్రకారం పింజారి మస్తాను సాబ్‌చే ప్రథమ తమలపాకుల పూజ, ఒడి బియ్యం సమర్పించటం కోసం నెరవేరుస్తారు.

సంగీత, సంకీర్తన కార్యక్రమాలు

గురువారం రాత్రి 8 గంటల నుంచి హూవినహొళె గ్రామం కరి బసవేశ్వర కళా సంఘం ఎం.గంగాధరయ్య స్వామి, పుట్టపర్తి రామాంజనేయులతో సంగీత, సంకీర్తన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద మూడు రోజుల ముచ్చటైన కడ్లె గౌరమ్మ కొలువు తీరే పండుగకు భోగలింగేశ్వర, హులిగమ్మ దేవస్థానం రంగస్వామి దేవస్థానం, సుంకలమ్మ దేవి, వేల్పుమడుగు రామ భక్త ఆంజనేయ స్వామి భజన మండలి వారిచే విశేష భజన కార్యక్రమాలు జరుగుతాయి. 7 శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి భక్తాదులచే అర్చనలు, నైవేద్యం సమర్పణ, సాయంత్రం 7.30 నుంచి తెల్లవారు జామున 3.30 వరకు ఆయా వీధుల మహిళలు ప్రత్యేకంగా హారతులు, బాణసంచా మంగళవాద్యాలతో కడ్లె గౌరమ్మను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. చివరి రోజు శనివారం ఉదయం 4.30 గంటల నుంచి గౌరి దేవి పూల రథోత్సవం, అనంతరం గౌరిదేవి గంగాదేవి ఒడిలో నిమజ్జనం తదితరాలు భక్తిశ్రద్ధలతో నెరవేరనున్నాయని ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఆరోగ్య సంరక్షణ అవసరం1
1/2

ఆరోగ్య సంరక్షణ అవసరం

ఆరోగ్య సంరక్షణ అవసరం2
2/2

ఆరోగ్య సంరక్షణ అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement