వైద్య శిబిరాల లబ్ధి పొందండి
రాయచూరు రూరల్ : జిల్లాలో ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పిలుపు ఇచ్చారు. నగరంలోని ఆరోగ్య కేంద్రంలో జాతీయ ఏకతా దివస్ సందర్భంగా చికిత్సలకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ప్రజలు బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులను ఆరంభంలోనే గుర్తించి సరైన చికిత్స పొందాలన్నారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ శిబిరంలో పాల్గొని ప్రభుత్వం నుంచి లభించే ఆరోగ్య పథకాలను వినియోగించుకోవాలన్నారు. శిబిరంలో ఉప కార్యదర్శి సిద్దప్ప, అధికారి శరణ బసవరాజ, రోణ, చంద్రశేఖర్, శివప్ప, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, ఆర్‌సీహెచ్ నందిత, వైద్యాధికారులు గణేష్, శ్రీనివాస్‌లున్నారు.


