అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

Nov 5 2025 7:49 AM | Updated on Nov 5 2025 7:51 AM

తృటిలో తప్పిన ప్రమాదం

రాయచూరు రూరల్‌: జిల్లాలో అదుపు తప్పిన ఈర్టీసీ బస్సు గుంతలో పడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం లింగసూగూరు తాలూకా ఆనెహొసూరు వద్ద బెండోణ వాగులో జరిగింది. ఆనెహొసూరు నుంచి నాగరాళకు వెళుతున్న సమయంలో ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపం ఏర్పడడంతో బస్సు అదుపు తప్పి రహదారి నుంచి వాగులోకి దిగింది. బస్‌ కండెక్టర్‌, డ్రైవర్‌తో పాటు 15 మంది ప్రయాణీకులకు చిన్నపాటి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం లింగసూగురు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు సీఐ వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బెయిల్‌పై పునరాలోచించండి

సుప్రీంలో పవిత్రా గౌడ పిటిషన్‌

సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన పవిత్రాగౌడ తన బెయిల్‌ రద్దుపై పునఃపరిశీలన చేయాలని సుప్రీంకోర్టులో మళ్లీ అర్జీ సమర్పించింది. కర్ణాటక హైకోర్టు గతంలో ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈనేపథ్యంలో ప్రధాన ముద్దాయి దర్శన్‌తో పాటు పవిత్రాగౌడ కూడా మళ్లీ జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన ఆగ్రహార జైల్‌లో ఉన్న ఆమె తరఫున లాయర్‌ సుప్రీంకోర్టులో అర్జీ సమర్పించి బెయిల్‌పై పునరాలోచన చేయాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు రానుంది.

6వ రోజుకు చెరుకు

రైతుల పోరాటం

హుబ్లీ: చెరుకు రైతన్నలకు ప్రస్తుతం సీజన్‌కు గాను ప్రతి టన్నుకు రూ.3500 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చిక్కోడి చక్కెర ఫ్యాక్టరీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడలగి తాలూకా గుర్రళ్లపురలో జరుగుతున్న ఈ ఆందోళన 6వ రోజుకు చేరింది. రైతన్నలు ఆందోళనలో భాగంగా తీవ్ర స్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కారు. ప్రముఖ రోడ్లపై ఈ పోరాటం చేశారు.

కాకినాడ–మైసూరు మధ్య వారంలో రెండు రోజులు రైలు

రాయచూరు రూరల్‌: కాకినాడ నుంచి మైసూరు వరకు వారంలో రెండు రోజుల పాటు రైలు(నంబరు–07033/07034)ను నడపడానికి రైల్వే అధికారులు శ్రీకారం చుట్టినట్లు ప్రవాసాంధ్ర ప్రముఖుడు సూర్యదేవర నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం నుంచి ఈ రైలును నడుపుతున్నారని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి బయలుదేరే ఈ రైలుతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నివాసమున్న వారికి అనుకూలమవుతుందన్నారు. కాకినాడ నుంచి విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్‌, వికాకాబాద్‌, సేడం, యాదగిరి, రాయచూరు, మంత్రాలయం, గుంతకల్‌, అనంతపురం, హిందూపురం మీదుగా బెంగళూరు, మైసూరు వరకు నడుపుతారని తెలిపారు. కాకినాడ–మైసూరు రైలు రాయచూరుకు ఉదయం 3 గంటలకు వస్తుందని తెలిపారు.

పాడి పశువులను సంరక్షించాలి

రాయచూరు రూరల్‌: నగర, గ్రామీణ ప్రాంతాలో పాడి పశువుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుండాలని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ బసవరాజ్‌ పాటిల్‌ పేర్కొన్నారు. మంగళవారం పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ఇన్‌క్లుషన్‌ కంపెనీ, సంజీవిని కర్ణాటక మైరాడ పథకం కింద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మైరాడ పథకం కింద 8 మంది పాడి పశువుల పెంపకందార్లకు శిక్షణ శిబిరం ముగింపు సభలో మూడు లీటర్ల సామర్థ్యం కల లిక్విడ్‌ నైట్రోజన్‌ టెంపరేచర్‌ పరికరాలను పంపిణీ చేశారు. రైతుల ఆదాయం పెరగవచ్చన్నారు. సమావేశంలో దురగుప్ప, రవి, ఆంజనేయ, విజయ్‌, మైత్రి, కార్యకర్తలున్నారు.

జనవరి వరకు హెచ్చెల్సీకి నీరు

బొమ్మనహాళ్‌: టీబీ డ్యాం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు జనవరి వరకు నీరు వస్తాయని అనంతపురం హెచ్చెల్సీ ఎస్‌ఈ సుధాకర్‌రావు తెలిపారు. మంగళవారం బొమ్మనహాళ్‌ హెచ్చెల్సీ సెక్షన్‌ పరిధిలోని నాగలాపురం సమీపంలో 116–400 కిమీ వద్ద కూలిన హెడ్‌ రెగ్యులేటర్‌ను హెచ్చెల్సీ ఈఈ పార్ధసారథి, డీఈఈ దివాకర్‌రెడ్డి, ఏఈఈ అల్తాఫ్‌లతో కలిసి పరిశీలించి మాట్లాడారు. డ్యాం నుంచి హెచ్చెల్సీకి 24 టీఎంసీల వాటా ఉండగా ఇప్పటి వరకు 15 టీఎంసీల నీటిని తీసుకున్నట్లు చెప్పారు. ఇంకా 7 టీఎంసీల నీరు వాటా ప్రకారం రావాల్సి ఉందన్నారు.

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు1
1/3

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు2
2/3

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు3
3/3

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement