
బాగా చదివి మంచి పేరు తేవాలి
బళ్లారిఅర్బన్: బాగా చదువుకొని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తేవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శోభారాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇండో అమెరికన్ డిగ్రీ కళాశాల ఆవరణలో కళాశాల వార్షికోత్సవం, డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నారు. స్వయం కృషితో శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నారు. రోడ్డు భద్రత గురించి, ట్రాఫిక్ నియమాలను తూచ తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. హెల్మెట్ లేకుండా బైక్‌ను నడపరాదన్నారు. మీ ప్రాణం మీ చేతిలో ఉండాలంటే హెల్మెట్ ధరించి బైక్ నడపాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ కార్యక్రమాల్లో విజేత విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కళాశాల పాలక మండలి చైర్మన్ పీహెచ్ నాయుడు, ప్రిన్సిపాల్ షేక్ సలీం బాషా, డిప్యూటీ ప్రిన్సిపాల్ సుధీర్‌కుమార్, హెచ్ఓడీ రాజేష్, రాజ, బీఆర్ఓ, పాలనాధికారి, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాగా చదివి మంచి పేరు తేవాలి