అంబేడ్కర్‌కు నివాళులు
బనశంకరి: బెంగళూరులో అంబేడ్కర్ ప్రదర్శనశాలను నెలకొల్పాలని కర్ణాటక బహుజన సమాఖ్య(కేబీఎఫ్) రాష్ట్రాద్యక్షుడు, సేవారత్న జీహెచ్.శంకర్ డిమాండ్ చేశారు. విధానసౌధ వద్ద డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. బెంగళూరులో 50 ఎకరాల విస్తీర్ణంలో 200 అడుగుల డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహం, జీవిత చరిత్ర తెలియజేసే ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నట్లు తెలిపారు.
బైకును ఆటో ఢీకొని
ఒకరికి గాయాలు
చింతామణి: అతివేగంగా వచ్చిన ఆటో బైకును ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పారపేట దగ్గర సోమవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. శిడ్లఘట్ట నుంచి చింతామణికి వస్తున్న ఆటో తాలూకాలోని నాయనహళ్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి బెంగళూరుకు బైకులో వెళుతుండగా ప్రమాదం సంభవించడంతో బైకు ఆటో డీకొన్న ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జుయింది. బైకు చోదకుడు శ్రీకాంత్ తీవ్రంగా గాయపడడంతో చింతామణి డాక్టర్లు ప్రధమ చికిత్స నిర్వహించి పరిస్ధితి విషమంగా ఉండడంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అంబేడ్కర్‌కు నివాళులు
అంబేడ్కర్‌కు నివాళులు


