కార్మికులను పర్మినెంట్ చేయండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్‌వర్క్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించకుండా విధుల నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పడాన్ని తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్‌వర్క్ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగలింగస్వామి ఖండించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎనిమిది నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో పాటు రబీ సీజన్‌లో తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల చేయడం లేదన్నారు. పనులు లేని కారణంగా విధులకు రావడం తగదని ఇంజినీర్ విజయలక్ష్మి పేర్కొనడాన్ని తప్పుబట్టారు. టాస్క్‌వర్క్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కూలీ కార్మికులకు చెల్లించాల్సిన రూ.10 కోట్ల దుర్వినియోగంపై విచారణ చేయాలన్నారు.
యజమానులపై భారం తగదు
రాయచూరు రూరల్: నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు, దుకాణాలకు సంబంధించి లారీల లోడింగ్, అన్‌లోడింగ్‌లకు పన్నుల చెల్లింపులో లారీ యజమానులు, డ్రైవర్లపై భారం మోపడం తగదని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు సయ్యద్ హసన్ మాట్లాడుతూ పరిశ్రమలు,బ దుకాణాల యజమానులు లోడింగ్, అన్‌లోడింగ్‌లకు చెందిన చార్జీలు చెల్లించే విషయంలో అన్యాయం చేస్తున్నారని, దాని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
క్రీడలతో శారీరక ఆరోగ్యం
హొసపేటె: క్రీడల్లో తరచుగా పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక బలం పెరుగుతుందని హంపీ కన్నడ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ డీఏ పరమశివమూర్తి అన్నారు. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం విద్యారణ్య ప్రాంగణంలోని స్టేడియంలో నుడి హబ్బ–34లో భాగంగా నిర్వహించిన నమ్మ హబ్బ క్రీడా కూటమిని జ్యోతి వెలిగించి, ఆకాశంలోకి పావురాన్ని వదిలి మాట్లాడారు. క్రీడలు, చదువు రెండూ సమానంగా ఉన్నప్పుడు, విద్యార్థుల మనస్సులు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయంలో క్రీడలు ఆడటానికి విశాలమైన స్థలం అందుబాటులో ఉందన్నారు. క్రీడల్లో గొప్ప విజయాలు సాధించగల ప్రతిభావంతులు ఇక్కడ ఉన్నారన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ప్రతిభను వెలికితీతకు వేదికగా ఉపయోగపడతాయన్నారు.
ప్రతిభ వెలికితీతకు కారంజి దోహదం
రాయచూరు రూరల్: విద్యార్థుల ప్రతిభ వెలికితీతకు ప్రతిభా కారంజి దోహదపడతాయని శాసన సభ్యులు బసన గౌడ, శివరాజ్ పాటిల్ అభిప్రాయ పడ్డారు. రాయచూరు తాలుకా జేగర్‌కల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కళోత్సవం, ప్రతిభా కారంజి– 2025–26ను ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకొని జ్ఞానంతో విద్యాభ్యాసం సాగించి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు అవసరమన్నారు. కార్యక్రమంలో బీఈఓ ఈరణ్ణ, మల్లేష్ నాయక్, మొయిన్ ఉల్ హక్, రావుత్ రావ్, దేవమ్మ, సిద్దనగౌడ, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణ, శ్రీనివాస రెడ్డి, హనుమేష్‌లున్నారు.
నియమాలు పాటిస్తే ప్రమాదాలు దూరం
హొసపేటె: రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించడం తప్పనిసరి అని ట్రాఫిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్ డీ.హులుగప్ప తెలిపారు. ఆయన బుధవారం తాలూకా పంచాయతీ హాలులో ఏర్పాటు చేసిన 37వ అంతర్జాతీయ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ట్రాఫిక్ నియమాలను పాటించని డ్రైవర్లకు జరిమానా తప్పదన్నారు. వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, బీమా, ఆర్‌సీ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన అన్నారు. టీపీ ఈఓ ఎండీ ఆలంబాషా, సీనియర్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఖలీద్, ప్యానెల్ న్యాయవాది డీ.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులను పర్మినెంట్ చేయండి
కార్మికులను పర్మినెంట్ చేయండి
కార్మికులను పర్మినెంట్ చేయండి


