నాగేంద్రకు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు
సాక్షి,బళ్లారి: వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటూ, ఇప్పటికే ఈ కేసులో మంత్రి పదవి కోల్పోవడంతో జైలుకు కూడా వెళ్లి వచ్చిన బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్రకు ఇదే కేసులో మళ్లీ నోటీసులిచ్చి వివిధ కోణాల్లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సీబీఐ నుంచి నాగేంద్రకు విచారణకు రావాలని నోటీసులు రావడంతో మళ్లీ అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.ఈ నేపథ్యంలో నాగేంద్ర బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణ చేపట్టి బుధవారానికి విచారణను వాయిదా వేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాగేంద్రకు బెయిలా? జైలా? అనే విధంగా చర్చలు సాగాయి. అయితే బుధవారం సాయంత్రం సంబంధిత కోర్టులో న్యాయమూర్తి నాగేంద్రకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. సీబీఐ దాఖలు చేసిన కేసులో నాగేంద్రకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో నాగేంద్ర మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. దీంతో నాగేంద్రతో పాటు ఆయన అభిమానులు, కార్యకర్తల్లో సంతోషం వెల్లివిరిసింది.
సిద్దరామేశ్వర జయంతికి గైర్హాజరుపై ఆందోళన
రాయచూరు రూరల్ : నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో జిల్లా పాలన యంత్రాంగం, జెడ్పీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బుధవారం ప్రధాన వేదికలో జరిగిన సిద్దరామేశ్వర జయంతి ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరు కావడంపై భోవి సమాజం అధ్యక్షుడు రామాంజినేయ, సమాజ సభ్యులు శశికళ, భీమణ్ణ తదితరులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
పంట నష్టంపై పరిశీలన
రాయచూరు రూరల్: గత ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు కళ్యాణ కర్ణాటక భాగంలో పంటలు అధికంగా నష్టపోయారు. బుధవారం పంట నష్టం అంచనాలపై కేంద్ర బృందం పర్యటించింది. కలబుర్గి జిల్లా కమలాపుర, యాదగిరి జిల్లా యాదగిరిలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ హైదరాబాద్ నూనె విత్తనాల డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జయశ్రీల ఆధ్వర్యంలో పొలంలో పంటను, పాడైన రహదారులు, తెగిన వంతెనలు, ఇతర పనులను కూడా పరిశీలించారు. కలబుర్గి జిల్లాధికారి ఫౌజియా తరన్నుం అధికారులకు వివరిస్తూ అధిక శాతం వానలు కురవడం వల్ల పంటలు దెబ్బ తిన్న అంశాలను వివరించారు. జెడ్పీ సీఈఓ భవర్ సింగ్ మీనా, అధికారులు సంతోష్ ఇనాందార్, మహ్మద్ మోహిసిన్, అనసూయ, అరుణ్ కుమార్‌లున్నారు.
సమాజాభివృద్ధికి విద్య ప్రధానం
రాయచూరు రూరల్ : నగరంలోని ఆశాపూర్ క్రాస్ వద్ద భోవి సమాజం ఆధ్వర్యంలో బుధవారం సిద్దరామేశ్వర జయంతి ఉత్సవాలు నిర్వహించారు. సిద్దరామేశ్వర విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా పాలన యంత్రాంగం, జెడ్పీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యుడు శివరాజ్ పాటిల్ పాల్గొని మాట్లాడారు. గురువుల మార్గదర్శనంలో సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానమన్నారు.
నాగేంద్రకు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు
నాగేంద్రకు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు


