రెవెన్యూ సిబ్బంది సమర్థంగా పనిచేయాలి
బనశంకరి: లైసెన్సు పొందిన భూసర్వేయర్లను పర్మినెంట్ చేయడంతో పాటు 36 ఏడీఎల్‌ఆర్‌లను నియమిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. గురువారం విధానసౌధ ఆవరణలో భూసర్వే, రెవెన్యూ శాఖ ఉద్యోగుల సంఘాలు ఏర్పాటుచేసిన 36వ జాతీయ భూసర్వే దినోత్సవాన్ని సిద్దరామయ్య ప్రారంభించి మాట్లాడారు. చెరువుల ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. త్వరితగతిన భూముల సర్వే పూర్తిచేయాలని, లైసెన్సు పొందిన సర్వేయర్లను పర్మినెంట్ చేయడంతో పాటు ఏడీఎల్‌ఆర్‌లు నియామకం చేస్తామని హామీ ఇచ్చారు. తహశీల్దార్లు, ఏసీ కార్యాలయ సిబ్బంది సమర్థంగా పనిచేస్తే ప్రజలు, రైతు సముదాయం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఖాళీ సర్వేయర్ పోస్టుల నియామకం పారదర్శకంగా జరిగిందని, త్వరలో నియామకపత్రాలు అందిస్తామని తెలిపారు.


