కవిగోష్టులతో ప్రతిభ బహిర్గతం
రాయచూరు రూరల్: నేటి రోజుల్లో జిల్లాలో కవిత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావ్ కులకర్ణి పిలుపునిచ్చారు. కన్నఢ సంఘంలో వసంత కావ్య కవిగోష్టులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కన్నడ సంఘం, హొసమని ప్రకాశన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. కవుల కవితలను గుర్తించి వారి కళా నైపుణ్యత వెలికితీతకు అవకాశం కల్పించే ఇలాంటి వేదికలు అవసరమన్నారు. కార్యక్రమంలో కన్నడ సంఘం అధ్యక్షులు శాంతప్ప, హొసమని ప్రకాశన అధ్యక్షుడు బషీరుద్దీన్, అరవింద్ కులకర్ణి, బసవరాజ్, శ్రీనివాస్ గట్టు, మురళీధర్, రాజశ్రీ, అశోక్ కుమార్ జైన్‌లున్నారు.
గుడిగంటి మర్రిస్వామి రథోత్సవం
రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం వందలాది మంది భక్తుల సమక్షంలో ఆశాపుర రోడ్డులో గుడిగంటి మర్రిస్వామి మఠంలో
గుడిగంటి నామకరణ ఊయల సేవ వైభవంగా జరిగింది. పురాణ ప్రవచనంలో భాగంగా మహిళలతో గుడిగంటి నామకరణం చేశారు. కార్యక్రమంలో ఒప్పత్తేశ్వర స్వామి మఠాధిపతి సదానంద శివాచార్య, శ్రీదేవి, శాంభవి పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవం నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో సిద్దారూఢ ఊయలోత్సవం
హుబ్లీ: ఆరాధ్య దైవం సిద్దారూఢ 190వ జయంతి సందర్భంగా నగరంలోని సిద్దారూఢ మఠంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సిద్దారూఢ స్వామి గురునాథారూఢ స్వామి సన్నిధికి అభిషేకం, విశేష పూజలు, మధ్యాహ్నం ముత్తైదువులకు ఒడినింపే కార్యక్రమం, ఉభయ స్వాముల ఉత్సవమూర్తులకు పల్లకీ ఉత్సవాలను పల్లకీ ప్రదర్శనను సకల వాయిద్య మేళాలతో వివిధ చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. సకాల మఠానికి పల్లకీ ఉత్సవం తిరిగి వెళ్లిన వేళ మహిళలు కుంభాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం కై లాస మంటపంలో ఏర్పాటు చేసిన ఊయలోత్సవాన్ని మఠం చైర్మన్ చెన్నవీర ముంగరవాడి ప్రారంభించారు. ట్రస్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు వినాయక ఘోర్చే, గౌరవ కార్యదర్శి రమేష్ బెళగావి, ధర్మకర్తలు బాలు మగజికొండి, బసవరాజ కళ్యాణ శెట్టర్, డాక్టర్ గోవింద మన్నూర, సర్వమంగళ పాఠక్, ఈరణ్ణ తుప్పదలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
పీహెచ్‌డీ ప్రదానం
హొసపేటె: నగరంలోని 8వ వార్డులోని కొండనాయకనహళ్లికి చెందిన బసవరాజ్‌కు విజయనగర శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీని ప్రదానం చేసింది. వాణిజ్య విభాగం వ్యాపార అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఏ.వీణాశ్రీ మార్గదర్శకత్వంలో దేశంలోని ఇనుము, ఉక్కు కంపెనీలపై ఐఎన్‌డీఏ అధ్యయనాన్ని స్వీకరించడానికి ముందు, తరువాత ఆర్థిక నివేదికల నాణ్యత అనే అంశంపై సమర్పించిన వ్యాసానికి ఈ పట్టాను ప్రకటించింది.
నేత్రపర్వంగా కొత్తల
ఆంజనేయ రథోత్సవం
హొసపేటె: కూడ్లిగి పట్టణ ప్రజల ఆరాధ్య దైవం కొత్తల ఆంజనేయ స్వామి రథోత్సవం తోటి భక్తుల సమక్షంలో ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెల్లవారు జామున స్వామీజీ ఊరేగింపు ప్రారంభమైంది. రాహుకాలం కారణంగా సాయంత్రం 6.30 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. స్వామి వారి జెండాను వేలంలో రూ.4 లక్షల ధరకు భక్తుడు సునీల్ కొనుగోలు చేశారు. సాయంత్రం, పల్లకీలో స్వామి వారిని ఊరేగింపుతో రథం వద్దకు తీసుకొచ్చారు. స్వామి వారిని రథంలో కూర్చొండ బెట్టిన తరువాత రథోత్సవం ప్రారంభించారు. భక్తులు రథంపైకి అరటిపండ్లు విసిరి తమ భక్తిని చాటారు.
కవిగోష్టులతో ప్రతిభ బహిర్గతం
కవిగోష్టులతో ప్రతిభ బహిర్గతం
కవిగోష్టులతో ప్రతిభ బహిర్గతం


