బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి | - | Sakshi
Sakshi News home page

బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి

Apr 7 2025 10:28 AM | Updated on Apr 7 2025 10:28 AM

బాలుడ

బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి

మర్మాంగంపైకి కందిరీగలు

దావణగెరె జిల్లాలో అమానుష ఘటన

తొమ్మిది మంది అరెస్ట్‌

సాక్షి,బళ్లారి: బాలుడిని చెట్టుకు కట్టేసి దాడిచేసి అతనిపైకి కందిరీగలు విడిచిన అమానుష ఘటన దావణగెరె జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నగిరి తాలూకా నల్లూర సమీపంలోని అస్తాపనహళ్లిలో నివసిస్తున్న 16 సంవవత్సరాల వయసున్న బాలుడు దొంగతనాలు చేస్తున్నాడని, మహిళల పట్ల అసభ్యప్రవరిస్తున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతన్ని పట్టుకుని చెట్టుక కట్టేసి విక్షణారహితంగా కొట్టారు. దుస్తులు ఉడదీసి మర్మాంగానికి కందరీగలను వదిలారు. దీంతో బాలుడు అపస్మారస్థితిలోకి వెళ్లడంతో కొందరు వ్యక్తులు స్పందించి ఆస్పత్రికి తరలించి,పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేసిన పోలీసులు 9 మందిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.

జీపీ సభ్యుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

హుబ్లీ: బీదర్‌ శివారు ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన జీపీ సభ్యుడు, వణ్ణికేరి నివాసి వైజినాథ్‌ హత్య కేసును పోలీసులు ఏడు గంటల్లోనే ఛేదించారు. ఈమేరకు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. బీదర్‌ నావదగేరి చెందిన ఇద్దరు, తాలూకాలోని వణ్ణికేరి చెందిన మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశామని, కీలక సూత్రాధారి పరారీలో ఉన్నాడని ఆ జిల్లా ఎస్పీ ప్రదీప్‌ గుంటి మీడియాకు తెలిపారు. వణ్ణకేరిలో జరిగిన ఎస్సీ,ఎస్టీ దౌర్జన్య కేసులో బాధిత కుటుంబాల తరపున వైజినాథ్‌ నిలబడటంతో అదే గ్రామానికి చెందిన వారు కక్ష పెంచుకొని హత్య చేసినట్లుగా నిందితులు వెల్లడించారని ఎస్పీ వివరించారు. డీఎస్పీలు శివన్నగౌడపాటిల్‌, ఎస్‌ఎన్‌ సనాధి నేతృత్వంలో నూతన నగర పోలీస్‌ స్టేషన్‌ సీఐ విజయ్‌కుమార్‌ బావగి, ఎస్‌ఐలు ప్రభాకర్‌ పాటిల్‌ సయ్యద్‌ పటేల్‌, అబ్దుల్‌ సమద్‌, హులెప్పలు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్‌చేశారని తెఇపారు.

హనీట్రాప్‌పై ఆధారాలున్నాయి

బీజేపీ బహిష్కృత నేత

బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌

హుబ్లీ: సహకార శాఖ మంత్రి కేఎన్‌.రాజన్నపై హనిట్రాప్‌ జరిగిందన్న వ్యవహారంలో తన వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని బీజేపీ బహిష్కృత నేత బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ తెలిపారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నేతలను అంతం చేసిందే కాంగ్రెస్‌ అని అన్నారు. హనిట్రాప్‌ వెనుక రెండు పార్టీల్లోని మహానేతలు హస్తం ఉందన్నారు. తన వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. నాకు హాయ్‌ చెబితే బై అంటానని యత్నాళ్‌ అన్నారు. తనకు వ్యతిరేకంగా కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో యాగం జరిగిందని ఆరోపించారు. హుబ్లీలో కూడా ఓ యాగం చేశారని, అయితే తనకు ఎలాంటి హాని జరగదని జాతకంలో ఉందన్నారు. యాగం జరిగాక శత్రు సంహారం జరగలేదని, అయితే సిద్దరామయ్యకు కాళ్ల నొప్పులు వచ్చాయని ఎద్దేవా చేశారు.

ఉపాధి పనులను

వినియోగించుకోండి

హొసపేటె: ఉపాధి హామీ పథకం పనులను కూలీలు సద్వినియోగం చేసుకొని స్థానికంగా ఉపాధి పొందాలని జిల్లా పంచాయతీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌ వి. సూచించారు. కొప్పళ్‌ తాలూకాలోని ఇందరగి గ్రామ పంచాయతీ ఇందరగి గ్రామంలో హోసకరేలో జరుగుతున్న పూడిక తీత పనులను ఆయన పరిశీలించారు. రోజుకు రూ. 370 కూలీతో వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కూలీ 40 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వితేనే రూ. 370 చెల్లిస్తారన్నారు. కొలత తక్కువగా ఉంటే వేతనాలు తక్కువగా చెల్లిస్తామని తెలిపారు. ఉపాధి పనుల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈత కొలను ప్రవేశ రుసుము రెట్టింపు

హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం పాలు, విద్యుత్‌, డీజిల్‌ ధరలు పెంచడంతో ఇప్పటికే ప్రజల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా హుబ్లీ ధార్వాడ కార్పొరేషన్‌ ఈతకొలను ప్రవేశ రుసుమును రెట్టింపు చేసింది. ఒకే పర్యాయం రూ.50 నుంచి రూ.100కు పెంచడంతో ప్రజలు కార్పొరేషన్‌పై మండిపడుతున్నారు. ఆరోగ్యం, వ్యాయమం కోసం రోజూ దాదాపు 500 మంది, సెలవు రోజుల్లో 600 మంది ఈత కొట్టేందుకు వస్తుంటారు. పెంచిన ధరతో వెనుకడుగు వేస్తున్నారు. ఈ విషయమై పాలికె కమిషనర్‌ రుద్రేష్‌ గాలి మాట్లాడుతూ ఈతకొలను నిర్వహణకు ప్రతినెల రూ.2.5 లక్షలు ఖర్చు అవుతోందన్నారు. ప్రవేశ రుసుము ద్వారా కేవలం రూ. లక్ష మాత్రమే సమకూరుతోందన్నారు. నిర్వహణ, సిబ్బంది వేతనాల ఖర్చును భరించడానికి ప్రత్యేక రుసుమును పెంచామని తెలిపారు.

బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి1
1/2

బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి

బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి2
2/2

బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement