ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడితే కేసులా?
హుబ్లీ: ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని, సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే బీజేపీ కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని, దీంతో రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకొందని మాజీ సీఎం, ఎంపీ బసవరాజ్ బొమ్మై అన్నారు. హావేరిలో ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ 45వ సంస్థాపన దినంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేయడంతో ఎవరికి స్వాతంత్ర ఉండేది కాదన్నారు. దీంతో విద్యార్థులతో ప్రారంమైన పోరాటాలు పూర్తిగా క్రాంతిగా మారి ఏబీ వాజిపేయి నేతృత్వంలో అద్వాని సహా అందరు ఉధ్యమంలో పాల్గొన్నారన్నారు. అంతకు ముందు 1925లోనే ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన అయిందని గుర్తు చేశారు. 45 ఏళ్ల పాటు పార్టీ ప్రస్తానం సాగడం ప్రతి కార్యకర్తకు గర్వకారణం అన్నారు. కాంగ్రెస్‌తో ఓబీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తాండవం ఆడుతుంతోందని సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు.


