పెద్ద హనుమంతుని శోభాయాత్ర
కోలారు: శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామసేన ఆధ్వర్యంలో కోలారు గాంధీవనంలో బృహత్ వేదిక మీద బాల రాముని మూర్తిని ప్రతిష్టించి మూడు రోజుల పాటు రామోత్సవం నిర్వహించారు. ఆదివారం రోజున నగరంలో శోభాయాత్రను నేత్రపర్వంగా జరిపారు. సినీ నటుడు వశిష్టసింహ ప్రారంభించారు. వశిష్టసింహ మాట్లాడుతూ ధర్మరక్షణ కార్యం నేడు అత్యంత ఆవశ్యకమన్నారు. సమాజంలో హిందూ ధర్మ మహత్వాన్ని తెలియజేయాలన్నారు. సమాజంలో యువత దారి తప్పకుండా జాగ్రత్త వహించాలన్నారు. విశ్వంలో హిందూ ధర్మం వంటి పురాతన ధర్మం మరొకటి లేదు. బృహత్ హనుమాన్ విగ్రహంతో కూడిన శోభాయత్ర నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
రాఘవ మఠంలో నవమి శోభ
బనశంకరి: బెంగళూరు జయనగర ఐదోబ్లాక్‌లో వెలసిన నంజనగూడు శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో శ్రీరామోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీతారామలక్ష్మణ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం, బంగారు తొట్టెలలో శ్రీరామునికి అలంకారం, పల్లకీ ఉత్సవం, గజవాహనోత్సవం తదితరాలను భక్తజనం మధ్య కనులవిందుగా నిర్వహించారు. మఠం సిబ్బంది, భక్తులు ఉత్సవంలో పాలొన్నారు.
కోలారులో నవమి కోలాహలం
పెద్ద హనుమంతుని శోభాయాత్ర


